Header Banner

ఏపీలోని ఆ 15 రోడ్లకు మహర్దశ.. జాబితా ఇదే! రహదారుల జాబితాలో ఎక్కువ ఆ జిల్లాలోనే.!

  Tue Apr 29, 2025 11:43        Politics

రాష్ట్రంలో మౌలిక వసతుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లుజాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తోంది. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందులో భాగంగా పోర్టుల సమీపంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు పోర్టులకు సమీపంలో జాతీయ రహదారులు ఉన్నాయి. అయితే ఈ జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులను అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోడ్లను విస్తరించి, అభివృద్ధి చేయటంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జాతీయ రహదారుల నుంచి పోర్టులను చేరేందుకు ఈ రాష్ట్ర రహదారులను నిర్మించారు. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర రహదారులను విస్తరించేందుకు ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజాంపట్నం, రామాయపట్నం, కళింగపట్నం, భావనపాడు, గంగవరం, రవ్వ పోర్టులకు అనుసంధానం చేసే 15 రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. వీటిలో కొన్ని3.75 మీటర్లు, మరికొన్ని 5.5 మీటర్లు, ఇంకొన్ని 7 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి: స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

అయితే అన్ని 10 మీటర్ల వెడల్పుతో విస్తరించాలని ఏపీ రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే ఇందుకు రూ.1,096.18 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆర్అండ్‌బీ అధికారులు ఎంపిక చేసిన రహదారుల జాబితాలో ఎక్కువ శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. భావనపాడు, కళింగపట్నం పోర్టులను కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారికి విస్తరించే ఆరు రోడ్లను విస్తరించనున్నారు. కళింగపట్నం - శ్రీకాకుళం - పార్వతీపురం రోడ్డు, గార- చింతాడ రోడ్డు, కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రోడ్డు, కళింగపట్నం-పర్లాకిమిడి రహదారి, డోల- పోలాకి- నౌపడ మార్గం , నౌపడ- వెంకటాపురం రహదారి ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టును కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారితో అనుసంధానం చేసే.. ఎలమంచిలి- గాజువాక రహదారి, అనకాపల్లి- పూడిమడక రోడ్డుతో పాటుగా పరవాడ- అసకపల్లి రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్టును కత్తిపూడి- ఒంగోలు జాతీయ రహదారికి అనుసంధానం చేసే.. అమలాపురం-చల్లపల్లి రోడ్డు, అనంతవరం- ఒల్లంకూరు రహదారి, కాట్రేనికోన-చల్లపల్లి రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇక నిజాంపట్నం పోర్టుకు వెళ్లే రేపల్లె- నిజాంపట్నం రోడ్డు, గుంటూరు-చీరాల రోడ్డు, మాచవరం-అల్లూరి-నిజాంపట్నం రోడ్లను కూడా విస్తరించనున్నారు. రామాయపట్నం పోర్టును అనుసంధానించే కందుకూరు- గుడ్లూరు -తెట్టు రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయాలని ఏపీ ఆర్అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations